09-03-2025 11:12:22 PM
ముగ్గురు అరెస్ట్...
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): బాచుపల్లిలో కల్తీ పత్తి విత్తనాల గ్యాంగును పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏపీ కర్నూల్ జిల్లాకి చెందిన ఆలూరు మదన్న, చవిట్లో ఆదర్శ్, గొల్ల ఉదయ్ లు ముఠాగా ఏర్పడి నకిలీ పత్తి విత్తనాలను నాణ్యమైన పత్తి విత్తనాలుగా నమ్మిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. కర్నూల్ నుండి హైదరాబాద్ కు కర్ణాటక రాష్ట్ర రిజిస్ట్రేషన్ నెంబర్ గల గూడ్స్ క్యారియర్ ఆటోలో తరలిస్తూ ఉండగా ఆదివారం మధ్యాహ్నం అగ్రికల్చర్ క్వాలిటీ కంట్రోల్ అధికారి యాదగిరి, బాచుపల్లి పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి కల్తీ విత్తనాల వెహికిల్ ను సీజ్ చేసి రవాణా చేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 15 బస్తాలలో 745 కిలోల నకిలీ కల్తీ విత్తనాలు, మూడు మొబైల్స్ ను స్వాధీనం చేసుకుని కేసు ధర్యాప్తు కొరకు బాచుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాచుపల్లి ఎస్హెచ్ఓ ఉపేందర్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.