calender_icon.png 17 April, 2025 | 12:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

08-04-2025 07:48:48 PM

చెన్నూర్: బిజెపి ఆధ్వర్యంలో రేషన్ షాప్ వద్ద నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. చెన్నూరు మండలంలోని సుద్దాల రేషన్ షాపు వద్ద పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒంటెద్దు పోకడల వ్యవహరిస్తుందని, కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో సన్నబియ్యం పథకం అమలు చేస్తుంటే తమ నాయకుడైన నరేంద్ర మోడీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని, రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాబోయే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆలం బాపు, పూర్ణ శంకర్, కొట్టారి వెంకటేష్, కొటారి బాపు, చింతల రాజేష్, స్వరూపారాణి పాల్గొన్నారు.