దంపతులకు అప్పగించిన కలెక్టర్ పమేలా
కరీంనగర్, నవంబరు 28 (విజయక్రాంతి): పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ గురువారం ఆమె నలుగురు పిల్లలను దత్తత తీసుకున్న దంపతులకు అప్పగించి మాట్లాడారు. దంపతులు దత్తత కోసం జిల్లా సంక్షేమశాఖ అధికారి కార్యాలయంలో సంప్రదించా లన్నారు. రక్త సంబంధీకుల నుంచి చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలకునే వారు కూడా ఈ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వ తి, డీసీపీవో పర్వీన్, పీవో తిరుపతి, శిశుగృహ మేనేజర్ తేజస్వీ, ఔట్ రీచ్ వర్కర్ రమేశ్, సోషల్ వర్కర్ రాజేశ్ పాల్గొన్నారు.