calender_icon.png 13 February, 2025 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి యజమాన్య పద్ధతులను అవలంబించాలి

13-02-2025 06:35:18 PM

జిల్లా వ్యవసాయ అధికారి రావూరి శ్రీనివాసరావు...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): వ్యవసాయంలో రైతులు నీటి యజమాన్య పద్ధతులను అవలంబించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రావూరి శ్రీనివాసరావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్ రైతు వేదికలో వాలంటరీ ఆధ్వర్యంలో రైతులకు వివిధ పంటలలో నీటి యాజమాన్యం, వాటర్ షెడ్ మేనేజ్మెంట్ పై రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ... రైతులు నీటి యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడులు పొందాలని సేంద్రియ వ్యవసాయ పద్ధతులలో పంటలు పండించి లబ్ధి పొందాలని సూచించారు.

కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త తిరుపతి మాట్లాడుతూ... తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించాలని దీనికోసం బిందు సేద్యం, తుంపర్ల సేద్యం విధానం పాటించాలన్నారు. వివిధ పంటలలో చీడపీడలు, రోగాల నివారణ, సస్య రక్షణ చర్యల గురించి వివరించారు. వాలంటరీ వ్యవసాయ అధికారి అన్నపూర్ణ మాట్లాడుతూ... రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పాటించి పంచగవ్య, శివామృతం, పచ్చి రొట్టె ఎరువులు వంటి పద్ధతులు పాటించి మంచి లాభాలు పొందాలని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ మిలింద్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారులు వెంకటేష్, చిరంజీవి, రాము, రైతులు పాల్గొన్నారు.