దేశ్‌పాండే ఫౌండేషన్ బృందానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): మహబూబ్‌నగర్ ప్రభు త్వ మహిళా డిగ్రీ కళాశాలను దత్తత తీసుకోవాలని తనను కలిసి దేశ్‌పాండే ఫౌండేషన్ బృందానికి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తికి వారు అంగీకారం తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక పరిస్థితుల మార్పు కోసం పని చేస్తున్న వీరు.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఆంగ్లంలో శిక్షణ ఇస్తున్నారు.
శుక్రవారం రోజు ఈ ఫౌండేషన్ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచడానికి పనిచేస్తున్న వీరు... రాష్ట్రంలో తమ కార్యక్రమాల విస్తరణకు ప్రభుత్వ సహకారం కోరింది. ఈ మేరకు సీఎంను కలిసి విజ్ఞప్తి చేశారు. స్పందించిన సీఎం రాష్ట్రంలోని కస్తుర్బా బాలికల పాఠశాలల్లో దేశ్‌పాండే ఫౌండేషన్ పని చేయాలని సూచించారు.
మహబూబ్‌నగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోనూ సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్‌రెడ్డి, ఫౌండేషన్ సభ్యులు గురురాజ్ దేశ్‌పాండే, జయశ్రీ దేశ్‌పాండే, రాజు రెడ్డి, జీ అనిల్ పాల్గొన్నారు.