దేశ్ పాండే ఫౌండేషన్ కు సూచించిన సీఎం రేవంత్ రెడ్డి..
దేశ్ పాండే ఫౌండేషన్ ప్రతినిధులతో పాటు హాజరైన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): బాలికల విద్యాభివృద్ధి కోసం దేశ్ పాండే ఫౌండేషన్ నిర్వాహకులు అవసరమైన సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. శుక్రవారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దేశ్ పాండే ఫౌండేషన్ సభ్యులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడారు. మహబూబ్ నగర్ లోని ఎన్టీఆర్ డిగ్రీ మహిళా కళాశాల, ఎంవీఎస్ డిగ్రీ, పీజీ కళాశాలలో మహిళల విద్యాభివృద్ధికి దేశ్ పాండే ఫౌండేషన్ సభ్యులు సహకార అందించాలని దత్తత తీసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 6 నుంచి 8వ తేదీ వరకు కర్ణాటకలోని హుబ్లీలో జరగనున్న కాన్ఫరెన్స్ సమావేశానికి సీఎం సూచన మేరకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దేశ్ పాండే ఫౌండేషన్ ప్రతినిధులు ఉన్నారు.