calender_icon.png 25 October, 2024 | 11:58 AM

కిశోర బాలికలు రక్తహీనత లేకుండా పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాలి

12-09-2024 02:57:11 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్

కామారెడ్డి,(విజయక్రాంతి): కిశోర బాలికలు రక్తహీనత లేకుండా పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘవన్ అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రం పరిధిలోని టేక్ రియల్ కేజీబీవీ జెడ్పిహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులకు రక్తహీనత పరీక్ష శిబిరం నిర్వహించారు. రక్తహీనతపై వచ్చే ఇబ్బందులను వివరించారు. రక్తహీనత తగ్గించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు.

ప్రతి ఆరు మాసాలకోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని బాలికల సూచించారు అన్ని పాఠశాలలో కిషోర్ బాలికలకు తగిన పరీక్షలు ఎప్పటికప్పుడు చేస్తు ఉండాలని వైద్య అధికారులకు సూచించారు. 363 మంది విద్యార్థినిలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తహీనత పరీక్ష చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ వైస్ చైర్పర్సన్ ఉరుదుండ వనిత మున్సిపల్ కమిషనర్ సుజాత జిల్లా శ్రీ శిశు సంక్షేమాధికారి బావయ్య జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ జిల్లా విద్యాశాఖ అధికారి రాజు సిడిపిఓలు సూపర్వైజర్లు వైద్య సిబ్బంది ఉపాధ్యాయులు అంగన్వాడి టీచర్ ఆశ వర్కర్లు పాల్గొన్నారు