calender_icon.png 28 November, 2024 | 9:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభం

28-08-2024 03:18:25 PM

అంబేడ్కర్ వర్సిటీలో అందరికీ అందుబాటులో నాణ్యమైన విద్య

ఖమ్మం, (విజయక్రాంతి):  డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ(యూజీ) బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో, పీజీ ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, బీఎల్ఎస్ఐఎస్సీ, ఎంఎల్ఎస్సీ తదితర డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 31వ తేదీలోగా ఆసక్తిగల అభ్యర్థులు ప్రవేశాలు పొందాలని హైదరాబాద్ లోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటి దృశ్య శ్రవణ మాధ్యమం పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రం  డైరెక్టర్, డీన్ సామాజిక శాస్త్రం ఆచార్య శ్రీనివాస్ వడ్డాణం, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ , ఎస్ అర్ అండ్ బి ఎన్ అర్  కాలేజ్ ఖమ్మం రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ వీరన్న మరియు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటి రసాయన శాస్త్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ దొడ్డపునేని కోటేశ్వరరావు తెలిపారు.

బుధవారం  ఖమ్మంలోని ఎస్ అర్ అండ్ బి ఎన్ అర్  కళాశాలలోని అంబేడ్కర్ యూనివర్సిటీ ఖమ్మం ప్రాంతీయ అధ్యయన కేంద్రాన్ని వారు సందర్శించారు. ఈ సందర్భంగా రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ వీరన్నతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఓపెన్ యూనివర్సిటీ డీన్ సామాజిక శాస్త్రం ఆచార్య వడ్డాణం శ్రీనివాసరావు మాట్లాడారు. రెగ్యులర్ డిగ్రీ, పీజీ మరియు డిప్లొమా కోర్సులు చేయలేని విద్యార్థులకు, గృహిణులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారులకు, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలనుకొనే వారందరికీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 44 సంవత్సరాలుగా అందుబాటులో వుంటు నాణ్యమైన విద్య ను అందిస్తుంది.

యూనివర్సిటీ నాక్ - ఎ  గ్రేడ్ను కూడా సాధించింది అని తెలిపారు. డిగ్రీ కోర్సులు, సెమిస్టర్ సిస్టంలోను, పీజీ కోర్సులు ఇయర్వైజ్ స్కీంలో నిర్వహిస్తున్నామన్నారు. కాంటాక్ట్ తరగతులతో పాటు స్టడీ మెటీరియల్ను అందజేస్తున్నామన్నారు. వివిధ వృత్తిలో పనిచేస్తూ కూడా ఓపెన్ వర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులను పూర్తిచేసుకునే అవకాశం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని స్టడీ సెంటర్లలో ప్రవేశాలు పొందేందుకుగాను విద్యార్హతలు, ఫీజులు, కోర్సుల వివరాలను ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. www.braouonline.in; www.braou.ac.in పొందవచ్చని వారు పేర్కొన్నారు. సమావేశంలో అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు..

ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు ఫీజు చెల్లించాలి

ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈనెల 31వ తేదీలోపు ట్యూషన్ ఫీజు చెల్లించాలని యూనివర్సిటి అసిస్టెంట్ ప్రొఫెసర్ దొడ్డపునేని కోటేశ్వరరావు తెలిపారు. పూర్తి సమాచారం కోసం, సందేహాలుంటే సమీపంలోని అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలన్నారు. డిగ్రీ, పీజీ పూర్వవిద్యార్థులు రెండో, మూడో సంవత్సరంలో సకాలంలో ఫీజులు చెల్లించ లేకపోయిన వారు 2015-16 నుంచి 2023-24 వరకు అడ్మిషన్లు పొంది ఉంటే వారు కూడా ఫీజులు చెల్లించేందుకు ఈనెల 31 వరకు గడువు ఉందని తెలిపారు.