పాల్వంచ (విజయక్రాంతి): ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ లో ఆరవ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రామవరం ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రసంజిత్ గోషాల్ తెలిపారు. గిరిజనులైన విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు లేని, విద్యార్థులు, దివ్యాంగులైన విద్యార్థులు, 5వ తరగతి చదివి మార్చి 2025 నాటికి పది నుంచి 13 ఏళ్ల లోపు వయసు వారై ఉండి ఉండాలి. ఆన్లైన్లో, దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరి తేదీ ఫిబ్రవరి 16, పరీక్ష రుసుము 100 రూపాయలు ఉంటుందని, ప్రవేశ పరీక్ష మార్చి 16వ తేదీన జరగనుందని, ఆరవ తరగతిలో ఖాళీలు 30 బాలికలకు 30 బాలురకు ఉన్నాయని పాఠశాల ప్రిన్సిపల్ ప్రసంజిత్ గోషాల్ తెలియజేసారు.