- కరీంనగర్ జిల్లాలో అప్పుడే మొదలైన ఫీజు దోపిడి
- చోద్యం చూస్తున్న విద్యాశాఖ
కరీంనగర్, జనవరి 3 (విజయక్రాంతి): హలో సార్... బాగున్నారా.. మీ అమ్మా యి/ అబ్బాయి పదవ తరగతిలో మంచి మార్కు లు రానున్నాయి.. 10 జీపీఏ మా ర్కులు తప్పకుండా వస్తాయి.. మా సర్వేలో మీ అ మ్మాయి/అబ్బాయి చదువులో ముందు న్నారని తెలిసింది.. మీ పిల్లలను మా కళాశా లలో చేర్పించండి. నాణ్యమైన బోధన ఉం టుంది.. మంచి మార్కులు వస్తాయి.. చదు వు గ్యారంటీ మాది.
ముందే అడ్మిషన్లు పొం దండి. తర్వాత సీట్లు ఉండవు.. అంటూ కా ర్పొరేట్ విద్యాసంస్థలు ఇప్పటి నుండే విద్యా ర్థుల తల్లిదండ్రులకు గాలం వేస్తున్నాయి. ముఖ్యంగా చైనా(చైతన్య నారాయణ) విద్యా సంస్థలు ప్రచారాన్ని విస్తృతం చేశాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులను ఏజెం ట్లుగా (పీఆర్వోలు) ఏర్పాటు చేసుకుని కమీషన్ పద్ధతిలో ఇప్పటి నుండే అడ్మిషన్లు ప్రారంభించాయి.
వీటితోపాటు మరికొన్ని విద్యాసంస్థలు కూడా బ్రోచర్లను ముద్రించి తమ సిబ్బంది ద్వారా ముందస్తు అడ్మిషన్లు ప్రారంభించాయి. కరీంనగర్లో పాఠశాలలు నిర్వహిస్తున్న చైతన్య సంస్థవారు వారి పాఠ శాలల్లో పదవ తరగతి పరీక్షలకు సిద్ధమ వుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు కౌన్సె లింగ్ నిర్వహిస్తూ హైదరాబాద్ లోని తమ బ్రాంచిలలో చేరేలా ప్రయత్నాలు ప్రారంభిం చారు.
నారాయణ వారు ఇక్కడ కళాశాల ఏర్పాటు చేసి భారీ హోర్డింగ్‌లతో ఫౌండే షన్ కోర్సులు, ట్రిబుల్ ఐటీ, మెడిసిన్, ఇంజ నీరింగ్ లాంగ్ టర్మ్ కోచింగ్‌ల పేరుతో ఫీజులను నిర్ణయించి అడ్మిషన్లు ప్రారంభిం చారు. గతంలో పదవ తరగతి పరీక్షలు పూర్తయి ఫలితాలు వెలువడక ముందు ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రచారం నిర్వహించే వారు. ఈసారి పరీక్షలకు ముందే ఈ తంతు ను ప్రారంభించారు.
ముందుగానే సీట్లు రిజర్వ్ చేసుకోకపోతే కోరుకున్న బ్రాంచిలలో సీట్లు దొరకవని విద్యార్థుల తల్లిదండ్రులు టెన్షన్‌కు గురిచేస్తూ అడ్మిషన్లు పొందుతు న్నారు. కరీంనగర్ జిల్లాలో సుమారుగా 12 వేల మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్ష రాయనున్నారు. ఆయా విద్యాసంస్థల నుండి అడ్రస్ లు, ఫోన్ నెంబర్లు సేకరించిన కార్పొరేట్ కళాశాలలు తమ ఏజెంట్ల ద్వారా అడ్మిషన్లు పొందుతున్నారు.
కమీషన్ ఏజెం ట్లకు విద్యార్థులు చదవబోయే ఫీజు ఆధారం గా 5 వేల నుంచి 10 వేల వరకు కమీషన్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే తమ పిల్లలను పరీక్షలకు సిద్ధం చేస్తున్న తల్లిదండ్రులు ఈ ప్రచార హోరుకు అయోమయానికి లోనవు తున్నారు. తరచు కాల్స్ వస్తుండడం, ఏజెం ట్లు వచ్చి మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తుం డడం తలనొప్పిగా మారింది. ఇంత జరుగు తున్నా విద్యాశాఖ చూసీ చూడనట్లు వ్యవహ రిస్తున్నది. ముందస్తు అడ్మిషన్లు ప్రారంభిం చిన వారిపై ఆర్వ నుండి ఇంతవరకు ఎలాంటి నోటీసులు కూడా జారీ కాలేదు.