calender_icon.png 12 February, 2025 | 11:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడ్మిన్లూ.. పైరసీతో జాగ్రత్త!

11-02-2025 12:00:00 AM

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘తండేల్’ చిత్రం ప్రస్తుతం థియే టర్లలో సందడి చేస్తోంది. అయితే ఈ సినిమాను కొందరు పైరసీ చేశారు.  ఓ బస్‌లో సినిమా ప్రదర్శితమవడంతో నిర్మాత బన్నీ వాసు, సమర్పకులు అల్లు అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై వారు సోమవారం ప్రెస్‌మీట్ నిర్వహిం చారు.

ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్లకు ఇదే నా హెచ్చరిక. అడ్మిన్లు జాగ్రత్తగా ఉండండి. మీరు జైలు వెళ్లే అవకాశం ఉంది. మేము పట్టుదలతో ఉన్నాం. పైరసీ పెద్ద క్రైమ్. ఇప్పుడు సైబర్ సెల్స్ బాగా పనిచేస్తున్నాయి. మిమ్మల్ని పట్టుకోవడం తేలిక. నిన్న ఆర్టీసీ బస్సుల్లో సినిమా పైరసీ ప్రింట్ ప్రదర్శించడం డ్రైవర్ అమాయకత్వం.

రెండు నెలల నుంచి మళ్లీ పైరసీ రాక్షసి పడగ విప్పి నాట్యమాడుతోంది. మొన్న దిల్ రాజు గారి సినిమాను ఇలాగే ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. చాలా ప్రయత్నాలు చేసి, లింక్‌లు తొలగించాం” అన్నారు. బన్నీ వాసు మాట్లాడుతూ.. “రెండేళ్ల నుంచి పైరసీ కంట్రోల్‌లోకి వచ్చింది. ‘గీత గోవిందం’ తర్వాత చాలా ఫైట్ చేశాం. కఠిన చర్యలు తీసుకోవడం.. ఓటీటీల రాకతో పైరసీ తగ్గుతూ వచ్చింది.

అన్ని భాషలతో పోలిస్తే, తెలుగులో పైరసీని చాలా కంట్రోల్ చేయగలిగాం. తెలుగులో ఎప్పుడూ లేని కల్చర్ రెండు నెలల కనపడుతోంది. ఈ సినిమా మా అందరి కష్టం. రెండేళ్లు ఎంతో శ్రమించాం. సినిమా బ్లాక్ బస్టర్ సాధించి మేము ఎంజాయ్ చేసే సమయంలో ఇలా జరిగింది. అల్లు అరవింద్ సూచన మేరకు సోమవారం నుంచి చాలా థియేటర్లలో టికెట్ ధరలు తగ్గించాం.

యువత ఈ పైరసీ ఉచ్చులో ఇరుక్కోవద్దు. దీనిపై కేసులు వేశాం. మూడో రోజే సినిమాను ఆర్టీసీ బస్సులో వేస్తే మేము ఏం చేయాలి. ఈ పైరసీలో మొదటి బాధితుడు పవన్‌కల్యాణ్ గారు. ‘అత్తారింటికి దారేది’ ముందే విడుదలైంది.

ఈ విషయాన్ని ఆయన దృష్టికీ తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటాం” అని చెప్పారు. ‘తండేల్’ పైరసీ చేస్తే 9573225069 నంబర్‌కు మెసేజ్ చేయాలని బన్నీ వాకోరారు. అభిమానులు చేయాల్సింది ఇదొక్కటేనని విజ్ఞప్తి చేశారు.