హైదరాబాద్: మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి పరిపాలన అనుమతులు శనివారం జారీ అయ్యాయి. రెండో దశలో 76.4 కిలీ మీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణానికి అనుమతి లభించింది. తెలంగాణ ప్రభుత్వం 24,269 కోట్ల వ్యయంతో మెట్రో రెండోదశను చేపడుతోంది. ఈ మేరకు మెట్రో రెండో దశ నిర్మాణానికి సంబంధించిన జీవో 196 జారీ అయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మెట్రో రైలు రెండోదశను నిర్మిస్తున్నారు. మెట్రో రెైలు రెండో దశ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ. 7.313 కోట్లు, కేంద్రం రూ. 4,230 కోట్లు ఖర్చు చేయనున్నాయి.