calender_icon.png 1 November, 2024 | 10:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విధుల్లో చేరకుంటే నోటీసులు

25-04-2024 01:27:31 AM

జీహెచ్‌ఎంసీలో ట్రాన్స్‌పోర్ట్  సిబ్బంది సర్థుబాటు

1014 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని వాటర్‌బోర్డు, ఈవీడీఎంలోకి..


హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : జీహెచ్‌ఎంసీ ట్రాన్స్‌పోర్ట్ విభాగంలో పనిచేసే ఔట్ సోర్సింగ్ డ్రైవర్లు, కార్మికులు ఇతర సెక్షన్లకు బదలాయిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సమయంలో కోడ్ అమల్లో ఉండగా బదలాయింపు ఆదేశాలు రావడంపై కార్మికు లు అయోమయానికి గురవుతున్నారు. బల్దియాలో మొత్తం ట్రాన్స్‌పోర్టు విభాగం రాంకీ చేతుల్లోకి వెళ్లిందనే ప్రచారం కూడా కార్మరికులను మరింత ఆందోళనలోకి నెట్టివే స్తోంది. దశాబ్దాలుగా పనిచేస్తున్న మమ్ములను ట్రాన్స్‌పోర్టు విభాగంలోనే కొనసాగిం చాలని కార్మికులు కోరుతుండగా, ఆదేశాలు పాటించకుంటే నోటీసులు అందుకోవాల్సి వస్తోందంటూ హెచ్చరిస్తున్నారు. 

ఆందోళనలో కార్మికులు...  

ట్రాన్స్‌పోర్టు విభాగంలో డ్రైవర్లు, కార్మికులుగా పని చేస్తున్న 200మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని వాటర్‌బోర్డుకు, ఈవీడీఎం విభాగానికి 814 మందిని సర్ధుబాటు చేస్తూ జీహెచ్‌ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో జీహెచ్‌ఎంసీ ట్రాన్స్‌పోర్టు విభాగం మొత్తం రాంకీ చేతుల్లోకి వెళ్లిందనే ప్రచారం కార్మికుల్లో ఆందోళన కలిగిస్తోంది. దీంతో తమ ఉద్యోగాలు ఎక్కడ ఊడతాయో అంటూ కార్మికులు అభద్రత భావానికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో కేటాయించిన విభాగంలో చేరేందుకు కార్మికులు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈవీడీఎంకు కేటాయించిన వారిలో ఇంకా 400 మంది రిపోర్టు చేయలేదని అధికారులు చెబుతున్నారు. దశాబ్దాలుగా ట్రాన్స్‌పోర్టు విభాగంలో పనిచేస్తున్న మమ్ములను ఉద్యోగం నుంచి తొలగించేందుకే ఇతర విభాగాలకు పంపిస్తున్నట్టుగా కార్మికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 

విధుల్లో చేరకుంటే ఉద్యోగం లేనట్టే... 

ట్రాన్స్‌పోర్టు విభాగంలో దాదాపు 2వేలకు పైగా కార్మికులు పని చేస్తున్నారు. ఈ విభాగంలో సిబ్బంది అదనంగా ఉన్నందునే ఇతర విభాగాలకు సర్ధుబాటు చేసినట్టుగా అధికారులు చెబుతున్నారు. అధికారుల ఆదేశాల మేరకు విధుల్లో చేరని వారికి నోటీసు లు జారీ చేసేందుకు ట్రాన్స్‌పోర్ట్ విభాగం రంగం సిద్ధం చేస్తోంది. రెండు దఫాలుగా జారీ చేసిన నోటీసులకు రిపోర్టు చేయకుంటే ఉద్యోగం ఉండదంటున్నారు. నోటీసులు అందజేసేందుకు అధికారులు సిద్ధమయ్యా రు. ఈ విషయంపై చీఫ్ ట్రాన్స్‌పోర్టు అధికారి అజయ్‌ను వివరణ కోరగా ట్రాన్స్‌పోర్టు విభాగంలో సిబ్బంది అదనంగా ఉన్నందునే ఇతర సెక్షన్లకు పంపుతున్నామన్నారు. వారి ఉద్యోగానికి ఎలాంటి ఢోకా లేదన్నారు.

జీహెచ్‌ఎంసీలోనే కొనసాగించాలి : యాదగిరి

స్వచ్ఛ గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు  ట్రాన్స్‌పోర్టు విభాగంలో డ్రైవర్లు, కార్మికులు దశాబ్దాలుగా పని చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా, కార్మికులను బదలాయింపు చేస్తున్నట్టు ఆదేశాలు ఇవ్వడం సరైంది కాదు. ట్రాన్స్‌పోర్టు విభాగాన్ని మొత్తాన్ని రాంకీ సంస్థకు అప్పగించేందుకు జరుగుతున్న కుట్ర ఇది. ట్రాన్స్‌పోర్టు విభాగాన్ని రాంకీకి అప్పగించడం కారణంగా బల్దియాకు ప్రతినెలా కోట్ల రూపాయలు నష్టం వస్తోంది. కొత్త వాహనాలను కొనుగోలు చేసి ట్రాన్స్‌పోర్టు సెక్షన్‌ను పూర్తిస్థాయిలో జీహెచ్‌ఎంసీనే నిర్వహించాలి. వాటర్ బోర్డు, ఈవీడీఎం విభాగాలకు బదలాయించిన సిబ్బందిని తక్షణమే వెనక్కి తీసుకురావాలి.