- డిప్యుటేషన్లను ప్రభుత్వం విరమించుకోవాలి
- టీఎస్ యూటీఎఫ్ డిమాండ్
హైదరాబాద్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): సమగ్రశిక్ష, యూఆర్‌ఎస్ ఉద్యో గులు, టీచర్లు సమ్మెలో ఉండడంతో వారి స్థానాల్లో అధికారులు ప్రభుత్వ మహిళా టీచర్లను సర్దుబాటు చేస్తున్నారు. కేజీబీవీ, మోడల్ స్కూల్స్ హాస్టళ్ల కు తాత్కాలిక సర్దుబాటు చేస్తూ జిల్లా విద్యాధికారులు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు.
అయితే సమ్మె చేస్తున్న ఉపాధ్యాయుల స్థానంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల డిప్యుటేషన్లను విరమించుకో వాలని టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ చేస్తూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ౧౭ రోజులుగా సమ్మె చేస్తున్న కేజీబీవీ, యూఆర్‌ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులు, ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి, సమ్మెను విరమింపజేయాలని ఆ సంఘం నాయకులు కోరారు.