calender_icon.png 23 November, 2024 | 11:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీ ఫిరాయింపు కేసుల విచారణ వాయిదా

25-10-2024 01:13:37 AM

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహ రి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను హైకోర్టు  వచ్చే నెల 4కి వాయిదా వేసింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లు గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాథే, జస్టిస్ శ్రీనివాసరావుతో కూడిన డివిజన్ బెంచ్ ముం దుకు విచారణకు వచ్చాయి.

అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ విచారణను వాయిదా వేయాలని కోరారు. వెంటనే బీఆర్‌ఎస్ పిటిషనర్ల తరఫు సీనియర్ అడ్వొకేట్ రామచందర్రావు అభ్యంతరం చెప్పారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై తక్షణమే అనర్హత వేటు వేయా ల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం కావాలని గడువు కోరుతూ కాలయాపన చేస్తోందన్నారు.

రెండు రోజుల వాదనలు కాగానే శని, ఆదివారాల సెలవులు వస్తాయని, వాయిదా లేకుండా విచారణ జరగాల్సిన అవసరం ఉందని ఏజీ వివరణ ఇచ్చారు. ఈ దశలో విచారణను నవంబర్ 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.