calender_icon.png 30 September, 2024 | 4:56 PM

జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ వాయిదా

30-09-2024 02:39:31 PM

రాజేంద్రనగర్: అత్యాచారం, ఫోక్సో  కేసులో అరెస్టు అయి చంచల్ గూడ జైల్లో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ ను రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ ఫోక్సొకోర్టు అక్టోబర్ 7 కు వాయిదా వేసింది. జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేశాడని బెదిరింపులకు పాల్పడినట్లు అసిస్టెంట్ మహిళ కొరియోగ్రాఫర్ ఆయనపై నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సెప్టెంబర్ 19న ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన న్యాయవాది బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేయగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.