calender_icon.png 23 October, 2024 | 9:55 PM

కృష్ణా నదీ పరీవాహాక ప్రాంతంలోని ప్రాజెక్టులపై విచారణ వాయిదా

09-07-2024 12:43:50 PM

న్యూఢిల్లీ: కృష్ణా నదీ పరీవాహాక ప్రాంతంలోని ప్రాజెక్టులపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై విచారణ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 20వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. ఆగస్టు 20 లోపు అఫిడవిట్ దాఖలుకు కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. అనుమతులు లేకుండా నీటిని వాడేస్తున్నారని గతంలో ఏపీ ప్రభుత్వం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శ్రీశైలం, సాగర్ నుంచి విద్యుదుత్పత్తి, ఇతర అవసరాలకు వాడేస్తున్నారని పిటిషన్ వేసింది.

కేంద్రం నుంచి ఆదేశాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని అదనపు సొలిసిటర్ జనరల్ వెల్లడించింది. ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని గతంలోనే ఏపీ చెప్పింది. ఇదే అంశంపై విముఖత వ్యక్తం చేస్తూ అఫిడవిట్ దాఖలు చేసిన తెలంగాణ,  రెండు ప్రభుత్వాల అభిప్రాయాలతో కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఇరు రాష్ట్రాలు నోటీఫికేషన్ జారీకి కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయని అదనపు సొలిసిటర్ జనరల్ పేర్కొంది. కేంద్రం నుంచి సూచనలు తీసుకోవాల్సి ఉన్నాదని ఏఎస్జీ ఐశ్వర్య భాటియా తెలపారు. సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.