calender_icon.png 26 November, 2024 | 12:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగార్జున పిటిషన్‌పై విచారణ వాయిదా

31-10-2024 01:45:22 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 30 (విజయక్రాంతి): మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసు విచారణ నవంబర్ 13కు వాయిదా పడింది. నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణ అధికారి సెలవులో ఉండటంతో విచారణను ఇన్‌చార్జి న్యాయమూర్తి వాయిదా వేశారు. కొండా సురేఖ తరఫున న్యాయవాది గుర్మీత్‌సింగ్ కోర్టుకు హాజరయ్యారు.

నాగార్జున వేసిన పిటిషన్‌పై ఇప్పటికే మంత్రి సురేఖకు న్యా యస్థానం సమన్లు జారీ చేసింది. సమన్లకు బుధవారం కోర్టులో కొండా సురేఖ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ కేసులో నాగార్జునతో పాటు సాక్షులుగా ఉన్న యార్లగడ్డ సుప్రియ, మెట్ల వెంకటేశ్వర్ల వాంగ్మూలాలను న్యా యస్థానం రికార్డు చేసింది.

కాగా, నాగచైతన్య, సమంతల విడాకుల వ్యవహారా నికి సంబంధించి కొండా సురేఖ నాగార్జునపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో తమ కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసేలా మంత్రి వ్యా ఖ్యానించారని నాగార్జున రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. 

కేటీఆర్ కేసు విచారణ సైతం..

అదేవిధంగా మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా కేసు విచారణను నాంపల్లి ప్రత్యేక కోర్టు నవంబర్ 13కు వాయిదా వేసింది. గత విచారణలో కేటీఆర్, దాసోజు శ్రవణ్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన న్యాయస్థానం బుధవారం ఇతర సాక్షులు తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్‌ల స్టేట్‌మెంట్‌లను రికార్డు చేయాల్సి ఉంది. కానీ, న్యాయమూర్తి సెలవులో ఉండటంతో కేసు విచారణను నవంబర్ 13వ తేదీకి వాయిదా వేసింది.