ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు పూనెం శ్రీనివాస్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ దనసరి రాజేష్...
ఎటూరునాగారం 500 మంది ఆదివాసీలతో భారీ ర్యాలీ..
మహబూబాబాద్ (విజయక్రాంతి): ఆదివాసీ పోడుభూములపై ఆదివాసులకు హక్కు కల్పించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు పూనెం శ్రీనివాస్, రాష్ట్ర జాయిట్ సెక్రటరీ దనసరి రాజేష్ అన్నారు. సోమవారం ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కేంద్రంలో ఆదివాసుల ఆరాధ్య దైవం కొమురం భీం విగ్రహానికి జిల్లా కన్వినర్ పర్షిక సతీష్ డివిజన్ అధ్యక్షుడు టింగ బుచ్చయ్య కలిసి పూల మాలలు వేసి అనంతరం 500 మంది ఆదివాసులతో ర్యాలీగా వెల్లడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగంలో 5 షెడ్యూల్ ప్రకారం అనేక సంక్షేమ చట్టాలను రూపొందించారని అన్నారు. అయినప్పటికి ఆచరణలో ఈ చట్టాలన్నీ ఘోరంగా విఫలమయ్యాయని అన్నారు. 5వ షెడ్యూల్ భూభాగంలో 170 చట్టం అమలులో ఉన్నప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసుల ఎదుగుదలకు దోహదపడకుండా ఐటీడీఎ ప్రాజెక్టు అధికారులు నిమ్మకునిరెత్తినట్లుగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు తాటి సుధాకర్, పూనెం జనార్ధన్ దారం సాంబరాజు దారం నరేష్ తదితరులు పాల్గొన్నారు.