calender_icon.png 5 January, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసి మహిళలు రక్తహీనతను అధిగమించాలి

02-01-2025 06:16:12 PM

మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదివాసీ మహిళల్లో రక్తహీనత ఎక్కువ శాతం ఉన్నందున రక్తహీనతను అధిగమించేందుకు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఇంద్రవెల్లి మండలం పిట్ట బొంగరం గ్రామంలో నవజ్యోతి యూత్  ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మనిషి శరీరంలో 5 లీటర్ల రక్తం ఉంటుందని, అందులో 330 ఎం.ల్ రక్తం మాత్రమే తీసుకోవడం జరుగుతుందని, రక్తదానంపై ఎలాంటి అపోహలను నమ్మవద్దని ఆన్నారు. ముఖ్యంగా ఎనీమియా, తల సేమియాతో పాటు గర్భిణీలు ప్రసూతి సమయంలో, ప్రమాదాల సమయాల్లో, కొంతమంది రోగుల శాస్త్ర చికిత్సలకు రక్తం అవసరమవుతుందని తెలిపారు. మూఢనమ్మకాలను పక్కన పెట్టి రక్తదానం చేసేందుకు గిరిజనులు ముందుకు రావాలన్నారు.