calender_icon.png 19 January, 2025 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీ అందాలయ్యా!

19-01-2025 12:41:19 AM

  • ఆకట్టుకుంటున్న భద్రాచలంలోని గిరిజన మ్యూజియం
  • సంస్కృతి, సంప్రదాయాలు, జీవనశైలిని భావితరాలకు తెలియజెప్పే ప్రయత్నం

భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 18 (విజయక్రాంతి): ప్రస్తుతం జనాలు ఏఐ జన రేషన్‌లో దూసుకెళ్తున్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు మరిచిపోతున్నారు. వెనకటి రోజుల్లో వాడిన వస్తుసామగ్రి, పరిక రాలు.. ఇలా అన్నీ మూలకు పడిపోయాయి. గుమ్మి అంటే ఏంటో తెలియని జనాలున్న రోజులివి. నగరాలు, పట్టణాలే కాదు పల్లెల్లో సైతం ప్రస్తుత పరిస్థితి ఇదే.

అయితే  ఇప్పటికీ మన సంస్కృతి, సంప్రదాయాలు, వస్తువులను గిరిజనులు కాపాడుకుంటూ వస్తున్నారు. మన మూలాలను నేటి తరాని కి, భవిష్యత్ తరానికి తెలియజెప్పే ఉద్దేశంతో భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేశారు. 

రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలానికి నిత్యం వేలాది భక్తులు తరలివస్తుంటారు. వారంతా గిరిజన మ్యూజి యాన్ని సందర్శించడం ద్వారా ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకుంటారనే ఉద్దేశంతో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఐటీడీఏ పీవో రాహూల్ దీన్ని ఏర్పాటు చేశారు.

వడ్ల గుమ్మి.. వేట బరిసె

మ్యూజియంలో గిరిజనుల ఇండ్లు, కోళ్లు, మేకలు పెంచుకునే గూళ్లు, వరి ధాన్యం నిల్వ ఉంచే గుమ్ములు, వంటపాత్రలు, వేటకు ఉపయోగించే బరిసెలు, బాణాలు, వ్యవసా య పరికరాలైన నాగలి, గొర్రు, ఎడ్లబండ్లు.. ఇలా ఎన్నెన్నో మనల్ని ఆకట్టుకుంటాయి. అలాగే గిరిజనులకు సంబంధించిన కొయ్యబొమ్మలు కూడా ఉన్నాయి.

పర్యాటకులు మ్యూజి యం దగ్గర ఫొటోలు దిగేందుకు సెల్ఫీ పాయింట్ కూడా ఉంది. రాత్రివేళ మ్యూజియం  రంగురంగుల విద్యుద్దీపాలతో ధగధగలాడిపోతోంది. ముక్కోటి ఏకా దశి సందర్భంగా వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి తరలివచ్చే భక్తులు, పర్యాటకులు మ్యూజియాన్ని సందర్శించి మూలవాసుల సంస్కృతి, సంప్రదాయాలను స్వయంగా వీక్షించి మధురానుభూతులతో తిరిగి వెళ్లాలని అధికారులు కోరుతున్నారు.