calender_icon.png 1 November, 2024 | 7:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒలింపిక్స్‌కు అదితి, దీక్షా డాగర్

25-06-2024 12:53:19 AM

  • భారత్ నుంచి బరిలో నలుగురు గోల్ఫర్లు

న్యూఢిల్లీ: భారత గోల్ఫ్ క్రీడాకారిణులు అదితి అశోక్, దీక్షా డాగర్‌లు ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. సోమవారం అంతర్జాతీయ గోల్ఫ్ ఫెడరేషన్ విడుదల చేసిన ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా ఈ ఇద్దరు పారిస్ బెర్త్ దక్కిం చుకున్నా రు. 24వ ర్యాంక్‌లో నిలిచిన అదితి అశోక్ భారత్ తరపున అత్యుత్తమ ర్యాంక్ పొందిన మహిళా గోల్ఫ్ ప్లేయర్‌గా నిలిచింది. ఇక దీక్షా డాగర్ 40వ ర్యాంక్‌లో నిలిచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. పురుషుల విభాగం నుంచి భారత నంబర్‌వన్ గోల్ఫ్ ప్లేయర్ శుభాంకర్ శర్మతోపాటు గగన్ జీత్ బుల్లర్ పారిస్ టికెట్ అందుకున్నారు.

పారిస్ క్రీడల్లో పురుషుల, మహిళల విభాగం నుంచి 60 మంది ప్లేయర్లు పోటీ పడనున్న గోల్ఫ్ ఈవెంట్‌లో వీరు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అదితికి ఇది మూడో ఒలింపిక్స్ కాగా.. దీక్షా డాగర్‌కు రెండోది. అయితే శుభాంకర్, గగన్‌జీత్‌లకు ఇదే తొలి ఒలింపిక్స్ కానుంది. టోక్యో ఒలింపిక్స్‌లో అదితి నాలుగో స్థానంలో నిలిచి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. గతంలో డెఫిలిం పిక్స్‌లో పాల్గొన్న దీక్ష ఈ సారి ఒలింపిక్స్ బరిలోకి దిగనుండటం గమనార్హం. లేడీస్ యూరోపియన్ టూర్ (ఎల్‌ఈటీ) నెగ్గిన రెండో భారత గోల్ఫర్‌గా దీక్షా డాగర్ నిలిచింది.