calender_icon.png 9 January, 2025 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదితి, అక్షరకు స్వర్ణ పతకాలు

02-01-2025 12:00:00 AM

హైదరాబాద్: గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం వేదికగా జరుగుతున్న సీఎం కప్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో యువ క్రీడాకారులు పతకాలతో సత్తాచాటారు. హైదరాబాద్‌కు చెందిన యువ స్విమ్మర్ అదితి నాదే ళ్ల  రెండు స్వర్ణాలతో మెరిసింది. అండర్-17 విభాగంలో 50 మీటర్ల బటర్ ఫ్లు విభాగంలో అదితి (00:32.18 సెకన్లు) తొలి స్థానంలో నిలిచింది.

ఇక 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో నూ 34.18 సెకన్లలో గమ్యాన్ని చేరి పసిడి చేజెక్కించుకుంది. రంగారెడ్డికి చెందిన సాయి అక్షర అవదూత కూడా రెండు పతకాలతో మెరిసింది. అండర్-17 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్‌లో సాయి అక్షర (1:25.31 సెకన్లు) స్వర్ణం గెలవగా.. లాస్య, హైందవి రజత, కాంస్యాలు గెలుచుకున్నారు.

200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్‌లో శివాని కర్రా (2:38.88 సెకన్లు) స్వర్ణం నెగ్గగా.. సాయి అక్షర (2:57.63 సెకన్లు) రజతం, జీవిక కాంస్యం ఒడిసిపట్టింది. అండర్-17 బాలుర విభాగంలో అభయ్, సచిన్, నాగ చైతన్య స్వర్ణ, రజత, కాంస్యాలు దక్కించుకున్నారు.