11-02-2025 06:43:48 PM
ఆదిలాబాద్ (విజయక్రాంతి): అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాల్లో భాగంగా ఉత్తమ డిస్క్రిప్షన్ డైరెక్టర్ గా ఆదిలాబాద్ కు చెందిన ప్రముఖ సినీ డైరెక్టర్ ఫయీమ్ సర్కార్ అవార్డు అందుకున్నారు. మంగళవారం హైదరాబాద్ లో జరిగిన చలనచిత్ర ఉత్సవంలో భాగంగా సినిమా, టీవీ రంగాలలో పలు విభాగాలలో అందించినటువంటి అంతర్జాతీయ అవార్డుల పురస్కారంలో భాగంగా బెస్ట్ డిస్క్రిప్షన్ డైరెక్టర్ గా జిల్లా కేంద్ర వాసి ప్రముఖ సినీ డైరెక్టర్ ఫయీమ్ సర్కార్ అవార్డు అందుకోవడం జరిగింది.
వంశీ టీవీ (సౌమిత్ మీడియా)+ మోర్డ్ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఈ అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి, కాంగ్రెస్ నాయకులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, వంశీకృష్ణ, డాక్టర్ శ్రీనివాస్, రాధా మనోహర్ దాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత ఫయీమ్ సర్కార్ మాట్లాడుతూ... తెలుగు, హిందీ భాషలలో రామసక్కనోడు సినిమాకి దర్శకత్వం వహించడం జరిగింది అని, ఈ సినిమా హిందీ భాషలో దేశవ్యాప్తంగా విడుదలై చక్కటి ప్రేక్షక ఆదరణ లభించిందన్నారు.