calender_icon.png 28 December, 2024 | 3:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ స్థాయి బేస్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపిక

27-12-2024 11:09:13 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): జాతీయ స్థాయి సీనియర్ నేషనల్ బేస్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలకు ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. పంజాబ్ లోని సంగూర్ లో ఈనెల 27 నుంచి నిర్వహించే 37వ జాతీయ స్థాయి సీనియర్ నేషనల్ బేస్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలకు జైనథ్ మండలం సావాపూర్ కు చెందిన టింగని లోకేష్, ఇచ్చోడ మండలం సిరిచెల్మ కు చెందిన చెవుల సమత లు ఎంపికైయ్యారని జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. ఇటీవల మహబూబాబాద్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సీనియర్ స్త్రీ, పురుషుల బేస్ బాల్ పోటీల్లో జిల్లా తరపున వీరు ప్రతిభ కనబరిచిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు వారు శుక్రవారం పంజాబ్ కు బయలుదేరినట్లు తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను, జిల్లా జట్టు కోచ్ బొంగురాల గౌతం ను జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, తదితరులు అభినందించారు.