ఆదిలాబాద్,(విజయక్రాంతి): సీఎం కప్(CM Cup Competitions) రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా క్రీడకారులు ఉత్తమ ప్రతిభ కనబరచాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా(Collector Rajarshi Shah) ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయి క్రీడాలకు ప్రత్యేక బస్సుల్లో ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారులు సోమవారం బయలుదేరారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వద్ద బస్సులకు కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మండల, జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు పోటీల్లో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించాలన్నారు. ప్రతి క్రీడా విభాగంలో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ వెంకటేశ్వర్లు, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, పీడీలు స్వామి, రాజేశ్, తదితరులు ఉన్నారు.