01-03-2025 04:47:19 PM
ఆదిలాబాద్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్ధిపేట్ ఎమ్మెల్యే హరీశ్ రావును ఆదిలాబాద్ జిల్లా మాల సంక్షేమ సంఘం నేతలు శనివారం కలిశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మాజీ మంత్రిని కలిసి ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షీంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విన్నవించారు. అసంబద్దమైన ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు జరిగిన అన్యాయాన్ని అసెంబ్లీలో పార్టీ పక్షాన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు కొప్పుల రమేష్, రాష్ట్ర కన్వీనర్ బేర దేవన్న, రాష్ట్ర కో కన్వీనర్ లు సింగరి అశోక్, పాశం రాఘవేంద్ర, మేదరి స్వామి, గులే సోమన్న, జిల్లా ఉపాధ్యక్షులు మలపతి సుభాష్ తదితరులు పాల్గొన్నారు.