కార్మిక, రైతు సంఘాల నేతలు..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే 4 లేబర్ కోడ్ లను, 3 రైతు నల్ల చట్టాలను వెంటనే రద్దు చేసి, జిల్లా అభివృద్ధి కోసం పార్లమెంట్ లో ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ లోని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో కేంద్రా, రాష్ట్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల నేతలతో కలిసి మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ లో ఆదిలాబాద్ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి వెనుకబడ్డ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు, మూతపడ్డ సిమెంట్ ఫ్యాక్టరీని రీ ఓపెన్ చేయడం, ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ ఏర్పాటు, దేశంలోనే నాణ్యమైన తెల్ల బంగారం పత్తి పంట పండించే జిల్లాలో టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేసి కొత్త ఇండస్ట్రీలను నిర్మించడం కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నారు. లేని పక్షంలో ఆందోళనలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో వివిధ కార్మిక, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు.