calender_icon.png 10 January, 2025 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీరభద్రున్ని దర్శించుకున్న ‘ఆదిలాబాద్’ వాసులు

06-01-2025 10:39:12 PM

భీమదేవరపల్లి,(విజయక్రాంతి): ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొత్తకొండ వీరభద్రున్ని ఆదిలాబాద్ వాసులు సోమవారం దర్శించుకున్నారు. హనుమకొండ జిల్లా(Hanumakonda District) భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో ఈనెల 10 నుండి వీరభద్రుని కల్యాణంతో కొత్తకొండ వీరన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం వీరన్న సన్నిధిలో వేలాది మంది భక్తులు విచ్చేసి దర్శనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ నుండి విచ్చేసిన భక్తుల బృందంతో డిఎస్పీ సిహెచ్.నాగేందర్‌గౌడ్ తో పలువురు భక్తులు వీరభద్రున్ని సన్నిధిలో ప్రూత్యేక పూజలు చేశారు.తాను గత 30 సంవత్సరాలుగా కొత్తకొండ వీరభద్రుని వద్దకు వచ్చి పూజలు చేయడం జరుగుతుందన్నారు.  ఉత్తరాయణ పుణ్యకాలం మకరసంక్రాతి పర్వదినం రోజున వీరభద్రుని దర్శనం శ్రేష్టమని సంక్రాంతి రోజున స్వామివారి దర్శనం చేసుకోవడానికి తిరిగి దర్శనానికి రానున్నట్లు తెలిపారు.