calender_icon.png 27 September, 2024 | 10:55 PM

అంగన్వాడీ కేంద్రం, పంచాయితీ లలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

27-09-2024 08:14:48 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఓ సాధారణ వ్యక్తి ల నేలపై కూర్చుని పిల్లలతో కలిసి భోజనం చేశారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి గ్రామంలో గల అంగన్వాడి కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రాల్లోని స్టాక్ రిజిస్టర్లు, ఇతరాత్ర రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పిల్లలకు, గర్భిణీలకు అందిస్తున్న పౌష్టికాహారం తదితర వాటిపై ఆరా తీశారు. అనంతరం మధ్యాహ్న భోజనం లో భాగంగా కలెక్టర్ స్వయంగా నేలపై కూర్చుని పిల్లలతో కలిసి భోజనం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. 

అనంతరం ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఫ్రై డే డ్రై డే సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా ఆంకోలి గ్రామంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఫ్రై డే డ్రై డే కార్యక్రమాలు పక్కాగా నిర్వహించాలని, ఇంటి పరిసరాల్లో ఉన్న కుండీలు, డ్రమ్ములు, వాడుకలో లేని వస్తువులలో ఉండే నీటి నిల్వ వల్ల దోమలు, ఈగలు చేరి అనారోగ్యానికి గురిచేస్తాయని, అటువంటి వాటిలో నీటిని తొలగించాలని అన్నారు. అనంతరం గ్రామ పంచాయితీ కార్యాలయం సందర్శించి ఫైనల్ ఓటరు జాబితా ను పరిశీలించి, అంగన్వాడి కేంద్రం లో చిన్నారులతో భోజనం చేశారు. అటు స్వచ్చత హీ సేవా లో భాగంగా అంకోలి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మొక్కలు నాటి ఆసుపత్రిని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి పద్మభూషణ్, డిఆర్డీఓ సాయన్న, డి.ఎల్.పి.ఓ ఫణీంద్ర, ఎంపిడిఓ నాగేశ్వర్ రెడ్డి, వైద్యాధికారులు, తదితరులు ఉన్నారు.