calender_icon.png 9 January, 2025 | 12:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి కృషి

08-01-2025 07:54:41 PM

ఎంపీ, ఎమ్మెల్యేల వెల్లడి...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): అదిలాబాద్ పట్టణ అభివృద్ధికి తమవంతుగా కృషి చేస్తామని ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ లు అన్నారు. పట్టణంలోని పలు కాలనీలో రూ.11 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల నుంచి కాలనీవాసులు రోడ్డు గురించి అడుగుతున్నారని గెలిచిన తర్వాత సమస్యను పరిష్కరిస్తామని మాట ఇచ్చామని ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకున్నామన్నారు. వీటితో పాటు ఇతర కాలనీలో రోడ్ల నిర్మాణానికి రూ. 40 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని, అవి మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తామన్నారు. గతంలో పార్టీ కౌన్సిలర్లను చూసి పనులు చేసేవారని కానీ ప్రజల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా పార్టీలకతీతంగా అవసరమున్న ప్రతి కాలనీలో సౌకర్యాలు కల్పిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కృష్ణ యాదవ్, లాలా మున్న, ఆకుల ప్రవీణ్, శ్రీనివాస్ యాదవ్, దయాకర్, ధోని జ్యోతి, ముకుంద్ తదితరులు పాల్గొన్నారు.