పెద్దపల్లి: కమాన్ పూర్ మండల కేంద్రంలో నిర్వహించే ఆది వరాహ స్వామి జయంత్యుత్సవాలకు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబుకు ఆహ్వానం అందింది. ఆలయ కార్యనిర్వాహణ అధికారి కొసన కాంతారెడ్డి, అర్చకులు కలకుంట్ల వరప్రసాద్ చార్యులు మంత్రి శీధర్ బాబును గురువారం కలిసి ఆహ్వానం పత్రికను అందజేశారు. ఆగస్టు 16వ తేద నుండి జరిగే ఆది వరాహ స్వామి జయంతి ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు. ఈ సందర్బంగా తప్పనిసరిగా జయంత్యుత్సవాలకు హాజరు అవుతానని మంత్రి శ్రీధర్ బాబు చెప్పినట్లు తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు ఇనగంటి రామారావు తదితరులు పాల్గొన్నారు.