మందమర్రి (విజయక్రాంతి): పట్టణానికి చెందిన దాసరి శ్రావణ్ కుమార్ ఇటీవల బహుజన సాహిత్య అకాడమీ సంస్థ వారిచే అంబేద్కర్ జాతీయ పురస్కారాన్ని అందుకోగా పట్టణ ఆది జాంబావా సంఘం నాయకులు అవార్డు గ్రహీతను ఘనంగా సన్మానించారు. మంగళవారం సింగరేణి హైస్కూల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు కంబాల రాజనర్సు మాట్లాడుతూ.. సాధారణ సింగరేణి కార్మికుడి బిడ్డ అయినా దాసరి శ్రావణ్ కుమార్ చేస్తున్న సామాజిక సేవలకు గుర్తింపుగా బహుజన సాహిత్య అకాడమీ అంబేద్కర్ జాతీయస్థాయి అవార్డును అందుకోవడం సంతోషకరమని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ బీదునూరి శంకర్, జనరల్ సెక్రటరీ ఆవునూరి పోషం, ఆర్గనైజింగ్ సెక్రటరీ దాసరి రాజనర్సు, ఇరుగురాల వెంకటి, గాలిపెల్లి తిరుపతి ఏల్పుల వెంకటి, నరెడ్ల లక్ష్మణ్, సంఘీ రవి, రేగుంట రాజన్న, కల్వల సురేష్, అంతర్పుల మధు, తొకల కుంబులు, బత్తుల శ్రీనులు పాల్గొన్నారు.