calender_icon.png 11 January, 2025 | 12:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లిలో ప్రధాన సమస్యలు పరిష్కరిస్తా: ఎమ్మెల్యే గడ్డం వినోద్

18-07-2024 03:11:06 PM

బెల్లంపల్లి (విజయ క్రాంతి): బెల్లంపల్లిలో ప్రధాన సమస్యలను పరిష్కరిస్తానని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. గురువారం తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దశలవారీగా బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతానన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఐదు గ్యారంటీలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. రైతులకు కూడా తమ ఖాతాల్లో లక్ష రూపాయలకు పైగా ప్రభుత్వం జమ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం హర్షనీయమన్నారు. అంతకుముందు తాండూర్ మండలంలో 33 మంది మహిళలకు రూ 33,03,828 కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, మున్సిపల్ అధ్యక్షురాలు జక్కుల శ్వేత తో పాటు పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు