calender_icon.png 29 January, 2025 | 8:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించండి..

11-12-2024 06:09:18 PM

ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలంలో బుధవారం గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని, గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్ టియు జిల్లా కమిటీ పిలుపులో భాగంగా టేకులపల్లి ఎంపీడీవో రవీంద్రరావుకు మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు డి ప్రసాద్, తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (ఐ ఎఫ్ టి యు) జిల్లా నాయకులు కత్తుల ఎర్రయ్యలు మాట్లాడారు. గ్రామపంచాయతీ కార్మికులు గ్రామాలను శుభ్రపరుస్తూ పల్లెలను సుందరంగా తీర్చిదిద్దుతున్న గ్రామపంచాయతీ కార్మికులు సకాలంలో వేతనాలు అందక అవస్థలు పడుతున్నారని అన్నారు.

గతంలో గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె చేసిన సమయంలో నాటి ప్రతిపక్ష పార్టీ అయినా కాంగ్రెస్ మేము అధికారంలోకి వస్తే గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను మరిచిపోయారని అన్నారు. తక్షణమే గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేనియెడల ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 14వ తేదీన కొత్తగూడెంలో జేఏసీ ఆధ్వర్యంలో జరుగు సదస్సును జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు, జినకా ప్రసాద్, పెనక సంపత్, బాబు మహేష్, తార్య, లింగ, అశోక్ నరేందర్, సురేష్ మాడే వెంకటేశ్వర్లు, జంపన్న తదితరులు పాల్గొన్నారు.