నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని పౌరసరఫరాల శాఖ గోదాముల్లో పనిచేస్తున్న అమాలి కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి విలాస్ అన్నారు. డిమాండ్ల సాధన కోసం నిర్మల్ బైంసా ముధోల్ ఖానాపూర్ పట్టణాల్లో అమాలి కార్మికులు చేస్తున్న సమ్మె శిబిరాలను గురువారం సందర్శించి మాట్లాడారు. హమాలి కార్మికులకు కూలి రేట్లు పెంచాలని ఇస్తారా వసతులు కల్పించాలని జీవో నెంబర్ 31 అమలు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అమాలి కార్మికులు పాల్గొన్నారు.