నిర్మల్ (విజయక్రాంతి): సివిల్ సప్లై గోదాముల్లో పనిచేస్తున్న అమాలి కార్మికులకు కూలీలు పెంచాలని మండల కేంద్రాల్లో గోదాంలో నిర్మించాలని కోరుతూ అమాలి కార్మిక సంఘం నిర్వహిస్తున్న సమ్మె సోమవారం నాటికి ఆరవ రోజుకు చేరుకుంది. కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన అమలు కార్మికులు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ అభిలాష అభినవ్ కు అందించారు. కూలీలు పెంచాలని బోనస్ ను అదనంగా చెల్లించాలని కొట్టుగూలి పెంచాలని తదితర డిమాండ్లను కలెక్టర్ కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో నాయకులు విలాస్ ఎస్ఎన్ రెడ్డి, కుండలిక్, భూమన్న తదితరులు పాల్గొన్నారు.