అదనపు కలెక్టర్ విద్యాచందన...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన(Additional Collector Vidyachandana) సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులను వివరాలను అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని శాఖల వారీగా అధికారులను ఆదేశించారు.
గ్రీవెన్స్ లో కొన్ని ఫిర్యాదులు....
టేకులపల్లి మండలం బద్రు తండా గ్రామపంచాయతీలో నివాసముంటున్న చింతా లక్ష్మీకాంత w/o మహేష్ సర్వే నెంబర్ 941/1అ, ఖాతా నెంబర్ 5113 విస్తీర్ణం 8 గుంటలు, మా తల్లిగారు లేటు మూతి చుక్కమ్మ పేరున ఉన్న భూమి విస్తీర్ణం 8 గుంటలు ఇట్టి భూమి మొత్తం విస్తీర్ణం 16 గుంటలు. పట్టాదారు పాస్ పుస్తకం కొరకు పలుమార్లు తాహసిల్దార్ కార్యాలయంకి తిరిగినప్పటికీ న్యాయం జరగలేదని తగిన న్యాయం చేయవలసిందిగా చేసిన దరఖాస్తులను పరిశీలించి తగు చర్యలు నిమిత్తం ఈ సెక్షన్స్ సూపర్డెంట్ కి ఎండార్స్ చేయడం జరిగింది. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని మధుర బస్తిలో నివాసం ఉంటున్న ఎంఏ రియాజ్ తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ సమస్త ఆపరేషన్ భద్రాద్రి కొత్తగూడెం సర్కిల్ కార్యాలయం మీకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసి ఉన్నానని, దరఖాస్తు చేసి నెల రోజులు దాటిన ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అని కావున పెట్టిన సమాచార దరఖాస్తు పూర్తి పారదర్శకంతో సమాచారం ఇప్పించగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం సి సెక్షన్ సూపర్ టెంట్ కు ఎండార్స్ చేయడం జరిగింది.
సుజాతనగర్ మండలం లక్ష్మీపురం తండాలో నివాసం ఉంటున్న బోడ రామ అనే రైతు ఆర్ఓఎఫ్ఆర్ అటవీ హక్కుల పట్టా పాస్ పుస్తకం కలిగి ఉన్నానని, తనకి ఉన్న ఎకరం 30 గుంటల వ్యవసాయ భూమిలో ఉపాధి హామీ పథకం ద్వారా 20 సంవత్సరాల క్రితం టేకు చెట్లను వేయడం జరిగిందని, టేకు చెట్లు పెద్దగా పెరగడం వల్ల పంటలు దిగుబడి రావటం లేదని, కావున ఉన్న 30 టేకు చెట్లను నరికి అమ్ముకొనుటకు అనుమతి ఇప్పించగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం ఈ సెక్షన్ సూపర్డెంట్ ఎండార్స్ చేయడం జరిగింది. ఇల్లందు మండలం మామిడి గుండాల గ్రామంలో నివాసం ఉంటున్న రామ్మోహన్రావు మామిడి గుండాల గ్రామంలో సర్వే నంబర్లు 130/2D/5/1,105/3,80,81,130/2D/5/3 లో గల మా వారసత్వ భూమిలో కొంతమంది అక్రమంగా బోర్లు వేయుచున్నారని, కావున బోర్లు వేయకుండా నిలుపుదల చేయించగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం తాహసిల్దార్ కు ఎండార్స్ చేయడం జరిగింది.
సారపాక గ్రామపంచాయతీ పరిధిలోని ముత్యాలమ్మ గుడి వెనుక వీధిలో గత ఎనిమిది నెలల నుండి త్రాగునీరు రావడం లేదని, మా బోరులలో నుండి మురికి నీరు వస్తుందని కావున మా సమస్యను పరిష్కరించి, త్రాగునీరు ఇప్పించగలరని ఆమస్తులు చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం బూర్గంపాడు ఎంపీడీవో కు ఎండార్స్ చేయడం జరిగింది. ఈ ప్రజావాణి కార్యక్రమంలో పరిపాలన అధికారి రమాదేవి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.