10-02-2025 05:01:53 PM
అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులను వివరాలను అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని శాఖల వారీగా అధికారులను ఆదేశించారు.
గ్రీవెన్స్ లో కొన్ని ఫిర్యాదులు..
లక్ష్మీదేవిపల్లి మండలం గట్టు మల్ల గ్రామపంచాయతీ పరిధిలోని గంగమ్మ కాలనీ కి చెందిన గిరిజన ప్రజలు గత 15 సంవత్సరాలుగా గంగమ్మ కాలనీలో నివాసముంటున్నామని, గట్టు మల్ల గ్రామానికి గంగమ్మ కాలనీకి మధ్య విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని, తమ యొక్క పిల్లల ఆధార్ కార్డు జారీ చేయడానికి జనన ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సిందిగా అధికారులు సూచించారని, కానీ తమకు ఆ విషయం తెలియక ఇప్పటివరకు జనన ధ్రువీకర పత్రాలు తీసుకోలేదని కావున మా సమస్యను పరిష్కరించి తమ పిల్లలకు ఆధార్ ధ్రువీకరణ పత్రాలు ఇప్పించగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం ఈ ఈ ఎన్పీడీసీఎల్ మరియు డి సెక్షన్ సూపర్డెంట్ కు ఎండార్స్ చేశారు.
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని కూలీ లైన్ లో నివాసం ఉంటున్న పరిమళ్ళ సుదర్శన్ రావు s/o లేటు వీరయ్య తమ యొక్క ఇంటి పట్టా రెగ్యులైజేషన్ లో తమ యొక్క ఇంటి పూర్తి విస్తీర్ణం 128 చదరపు గజాలు కాగా 58.99 చదరపు గజాలు అని డీడ్ ఆఫ్ కన్వీనియన్స్ పట్టా ఇచ్చినారని, కావున సవరణ చేసి డీడ్ ఆఫ్ కన్వీనియన్స్ ఇప్పించగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం కొత్తగూడెం తాసిల్దార్ కు ఎండార్స్ చేశారు. పాల్వంచ మండలం జగన్నాధపురం లో నివాసం ఉంటున్న బానోత్ లక్ష్మి w/o లేటు బానోత్ ఈరు తన భర్త అనారోగ్యం కారణం చేత మరణించారని, వితంతువు అయిన తనకు కుటుంబ పోషణ భారంగా ఉందని తనకు వితంతు పింఛన్ మంజూరు చేయాల్సిందిగా చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం డి ఆర్ డి ఓ కు అండర్స్ చేయడం జరిగింది.
జూలూరుపాడు మండలం జిపిఎస్ ట్రైబల్ వెల్ఫేర్ ఎల్.ఎల్.బి తండ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా మంచినీటి, విద్యుత్, ఫ్లోరింగ్ మరియు మరుగుదొడ్లు రిపేరు చేసి ఉన్నామని కానీ ఇప్పటివరకు పనులకు సంబంధించిన నిధులు మంజూరు కాలేదని కాంట్రాక్టర్ రాములు చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం వివో ఐ టి డి ఏ కు ఎండార్స్ చేయడం జరిగింది. ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.