03-03-2025 10:48:23 PM
జహీరాబాద్: జహీరాబాద్ పట్టణ సబ్ స్టేషన్ లో మూడవ 8.0 ఎంవీఏ పవర్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగింది. భవిషత్ అవసరాల దృష్ణా, లోడ్ పెరుగుతున్నందు వల్ల జహీరాబాద్ పట్టణ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందించేందుకు అదన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. మూడవ 8.0 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. టీజీ ఎస్ పీడీసీఎల్ విజ్ఞతో సంస్థ ఇంచార్జి డైరెక్టర్ నందకుమార్, సంగారెడ్డి జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీనాథ్, జహీరాబాద్ డివిజనల్ ఇంజనీర్ లక్ష్మీ నారాయణ, ఏడీఈ లు మధుసూధన్, రజనీ కాంత్, AE నాగరాజు, ఇతర విద్యుత్ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.