calender_icon.png 24 October, 2024 | 3:46 PM

తేనెటీగల పెంపకం చేపట్టి ఉపాధి పొందాలి

29-08-2024 04:22:52 PM

కె వి కె ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ శివక్రిష్ణ

బెల్లంపల్లి,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంత రైతులు తేనెటీగల పెంపకం చేపట్టి మెరుగైన ఉపాధి పొందాలని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ కోట శివక్రిష్ణ అన్నారు. గురువారం బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల రైతులకు తేనెటీగల పెంపకం లో పాటించాల్సిన విధానాలపై, పంట వ్యర్ధాలనుండి వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీ విధానం పై స్పష్టంగా అవగాహన కల్పించారు. రసాయనిక ఎరువుల వాడకం వల్ల భూసారం తగ్గి పంట దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉందని రైతులకు సూచించారు.

చిన్న పాటి కుటీర పరిశ్రమలు గా తేనెటీగల పెంపకాన్ని చేపట్టి ఆర్థికంగా వెనుకబడిన రైతులు అభివృద్ధి చెందాలని సూచించారు. బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అందిస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను రెండు జిల్లాల రైతులు సక్రమంగా వినియోగించుకోవాలని డాక్టర్ శివకృష్ణ కోరారు. ఈ నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ స్రవంతి, డాక్టర్ నాగరాజు, డాక్టర్ తిరుపతి లతోపాటు రెండు జిల్లాల రైతులు పాల్గొన్నారు.