13-03-2025 12:00:00 AM
ఉత్తర్వులు జారీ చేసిన పీయూ వీసీ జీఎన్ శ్రీనివాస్
పాలమూరు యూనివర్సిటీ మార్చి 12 : పీయూ యూనివర్సిటీలోని విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ వీసీ జీఎన్ శ్రీనివాస్ ఉత్తర్వులను జారీ చేశారు. ఫార్మసీ కళాశాలలో దశబ్దానికి పైగా అధ్యాపకురాలి గా పనిచేస్తున్న డా సుజాతను అకాడమిక్ సెల్ సమన్వయకర్తగా, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ విభాగం లో అధ్యాపకునిగా పనిచేస్తున్న డా సిద్దరామ గౌడ్ ని అకాడమిక్ కోఆర్డినేటర్ గా నియమిస్తూ నియామక ఉత్తర్వులు జ ఉపకులపతి ఆచార్య జి ఎన్ శ్రీనివాస్ జారీ చేయడంతో పాటు నియమక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పియు రిజిస్ట్రార్ ఆచార్య చెన్నప్ప,సంచాలకులు డా చంద్రకిరణ్ , సంయుక్త సంచాలకులు డా విజయలక్ష్మి, తదితరులు ఉన్నారు.