calender_icon.png 23 March, 2025 | 6:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేపల పెంపకం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు

22-03-2025 08:18:50 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): చేపల పెంపకం ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు మరింత అదనపు ఆదాయన్ని పొందవచ్చని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శనివారం రెబ్బెన మండలం లైన్ గూడ గ్రామంలో ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద ఏర్పాటుచేసిన చేపల పెంపకం కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి(Additional Collector Deepak Tiwari)తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం(Indira Mahila Shakti Scheme) ద్వారా అనేక అంశాలలో మహిళ స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు చేయూతనిస్తుందని తెలిపారు. ఇందిరమ్మ మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల సభ్యులు చేపల పెంపకం ద్వారా మరింత ఆదాయాన్ని పొందవచ్చని, సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయవచ్చని తెలిపారు.

మొట్టమొదట రెబ్బెన మండలంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, ఈ కేంద్రాన్ని ఆదర్శంగా తీసుకొని  మిగతా మండలాలలో ఇలాంటి చేపల పెంపకం కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మహిళా సంఘాలచే పుట్టగొడుగులు పెంపకం కొరకు ఆసక్తి ఉన్న మహిళా సంఘాల సభ్యులకు హైదరాబాద్ లో శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. మహిళా సంఘాలు వ్యాపారాలు చేయడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెంది ప్రతి మహిళ కోటీశ్వరురాలు కావాలన్నా ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా లాభసాటి వ్యాపారాలు చేసి ఆదాయ వనరులను పెంచుకోవాలని తెలిపారు. వేసవికాలం దృష్ట్యా చేపల పెంపకం దారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి రామకృష్ణ, ఎ. పి. ఎం.లు, సి. సి.లు, మండల సమాఖ్య అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.