calender_icon.png 17 April, 2025 | 10:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లన్నను దర్శించుకున్న అదనపు కమిషనర్

07-04-2025 12:26:05 AM

 చేర్యాల, ఏప్రిల్ 6: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున  స్వామిని దేవాదాయ శాఖ కమిషనర్ జ్యోతి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గర్భాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు ఇచ్చారు. ఆలయ కార్యనిర్వాహణ అధికారి కే రామాంజనేయులు స్వామివారి శేష వస్త్రములు, చిత్రపటంతోపాటు ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మహా దేవుని మల్లికార్జున్, ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, ఆలయ పర్యవేక్షకులు సురేందర్, శ్రీరాములు పాల్గొన్నారు.