calender_icon.png 18 January, 2025 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాచారంలో అడిషనల్ కలెక్టర్ పర్యటన

18-01-2025 12:00:00 AM

యాచారం జనవరి 17  :  రైతులు సాగు చేసుకుంటున్న ప్రతి ఎకరాకు రైతు భరోసా అందించనున్నట్లు జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా  సింగ్ తెలిపారు.  శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికను ఏడి సుజాత, ఆర్డీవో అనంతరెడ్డి తో కలిసి సందర్శించి భూ రికార్డులను పరిశీలించారు.  సాగు చేయని భూముల వివరాలను రైతు భరోసా నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు. 

గ్రామాల్లో టీములుగా విడిపోయి  నెంబర్ లో ఉన్న బై నెంబర్లు గుర్తిస్తూ పకడ్బందీగా సర్వే చేపట్టాలని సూచించారు.   గుట్టలు,  రైస్ మిల్, పెట్రోల్ బంకులు, ఇతర పరిశ్రమలు, లేఅవుట్ ఉన్న భూములు, రోడ్ల భూములు, భవనాలు నిర్మించుకున్న భూముల వివరాలను రైతు భరోసా  నుంచి తొలగించాలని అన్నారు. 

21, 23వ తేదీలలో గ్రామసభలు నిర్వహించి సాగుకు యోగ్యం కానీ భూముల వివరాలు చదివి వినిపించి వెబ్ సైట్లో పొందుపరచాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో అయ్యప్ప, ఎంపీడీవో నరేందర్ రెడ్డి ,ఏవో రవినాథ్, ఆర్‌అలు, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.