calender_icon.png 4 January, 2025 | 4:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడిషనల్ కలెక్టర్లకు గురుకులాల పర్యవేక్షణ బాధ్యతలు

02-01-2025 12:07:58 AM

  1. వసతి గృహాల పర్యవేక్షణ కూడా..
  2. మహిళా ఐఏఎస్‌లకు బాలికల విద్యాలయాల బాధ్యతలు 
  3. 15 రోజులకోసారి రాత్రి బస చేసే విధంగా చర్యలు

హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): ప్రభుత్వ గురుకులాలు, వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు అస్వస్థతకు గురవుతుండడం, పాము, ఎలుక కాట్ల బారి న పడడం, ఇటీవల పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతుండడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది.

దీనిలో భాగంగానే గురుకులాలు, వసతి గృహాల పర్యవేక్షణ బాధ్యతలను అడిషనల్ కలెక్టర్లకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. బాలికల గురుకులాలు, వసతి గృహాలను మహిళా ఐఏఎస్‌లు పర్యవేక్షిస్తారని తెలిపా రు.

అడిషనల్ కలెక్టర్లు, మహిళా ఐఏఎస్‌లు నెలవారీ సమీక్షలు నిర్వహించి ప్రభుత్వానికి సమగ్ర నివేదికలు అందివ్వాలని ఆదేశించారు. పర్యవేక్షణ అధికారులు నెలలో రెండుసార్లు రాత్రిళ్లు విద్యాలయాల్లోనే బస చేస్తారని తెలిపారు.

అలాగే రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, హాస్టళ్లలో ఆహార పదార్థాల నాణ్యత నూ వీరే చూసుకుంటారన్నారు. జిల్లా కొనుగోలు కమిటీకి పర్యవేక్షణ అధికారినే చైర్మన్ గా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. ఈ నెల నుంచే ఉత్తర్వులు అమలులోకి వస్తాయని ప్రకటించారు.