30-03-2025 09:03:32 PM
బైంసా (విజయక్రాంతి): టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్-I పరీక్ష జనరల్ ఫలితాలలో నిర్మల్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ భార్య బరీరా ఫరీదా రాష్ట్రస్థాయిలో 68వ ర్యాంకును (బిసి ఈ కేటగిరీలో మొదటి ర్యాంకు) సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. కాగా బరీరా ఫరీదా ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి డాక్టర్ ఆఫ్ ఫార్మసీ డిగ్రీని పూర్తి చేశారు. 2022 లో సివిల్స్ లో ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. హైదరాబాద్ కు చెందిన షేక్ ఫరీరుద్దీన్, షమీన్ ఉన్నిసాల కూతురు ఫరీదా, తండ్రి భారత వాయుసేనలో రిటైర్డ్ ఉద్యోగి, ఏడుగురు సంతానంలో ఆమె చిన్నవారు. ఈ సందర్భంగా ఆమె భర్త అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, కుటుంబ సభ్యులు అభినందించారు.