06-02-2025 10:06:40 PM
పాల్వంచ (విజయక్రాంతి): మహాత్మ జ్యోతిబాపులే బీసీ బాలికల గురుకుల విద్యాలయంను గురువారం రాత్రి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంట గదిని పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాలు పెడుతున్నారా లేదా అని ఆరా తీశారు. అనంతరం ఆమె తరగతి గదులకు ప్రవేశించి స్టడీ అవర్ లో విద్యార్థులు చదువుతున్న తీరును పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... విద్యార్థుల ఉపయోగించుకునే టాయిలెట్స్ ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అలాగే పరిశుభ్రమైన తాగునీటిని, నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి ఇందిరా, విద్యాలయ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.