calender_icon.png 12 February, 2025 | 1:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసుపత్రిని సందర్శించిన అడిషనల్ కలెక్టర్

11-02-2025 12:50:17 AM

కామారెడ్డి, ఫిబ్రవరి 10,(విజయ క్రాంతి): కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రినీ సోమవారం అడిషనల్ కలెక్టర్ విక్టర్ సందర్శించారు. పలు వార్డులను ల్యాబ్ లను పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు గురించి ఆరా తీశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్యం అందజేయాలని సిబ్బందికి సూచించారు.

ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం : జెడ్పీ సీఈవో

కామారెడ్డి , ఫిబ్రవరి 10,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ఏర్పాటు చేస్తున్నట్లు జడ్పీ సీఈవో చందర్ నాయక్ తెలిపారు. జిల్లాలో మొత్తం 25 జెడ్పిటిసి ,237 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు వెల్లడించారు. ఈనెల 11న పోలింగ్ కేంద్రాల ముసాయిదా విడుదల సోమవారం ఆయన విజయక్రాంతి తో మాట్లాడారు. ఎన్నికలు నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాలను గుర్తించామని ఓటర్ లిస్టు త్వరలో విడుదల చేస్తామన్నారు.