మేడ్చల్,(విజయక్రాంతి): మేడ్చల్ జిల్లాలో పలుచోట్ల వ్యవసాయానికి అనువుగా లేని భూములను అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఘట్కేసర్ మండలం పోచారం గ్రామంలో పలు సర్వే నెంబర్లు, యన్నంపేట గ్రామంలోని 121 సర్వే నంబర్ లో, మేడిపల్లి మండలం బోడుప్పల్ లోని 168 సర్వే నెంబర్ లో భూములను పరిశీలించారు. అదనపు కలెక్టర్ వెంట ఆర్డిఓ సైదులు, తహసిల్దార్ రజని తదితరులు ఉన్నారు.